
కళాశాల ప్రిన్సిపాల్‌కు హోదా సర్టిఫికెట్ అందిస్తున్న ఎమ్మెల్యే
నర్సంపేట: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇదివరకే న్యాక్ గుర్తింపు పొందగా.. గ్రామీణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఏకై క కళాశాలగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈమేరకు శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ తన క్యాంపు కార్యాలయంలో కళాశాల హోదా సర్టిఫికెట్‌ను కళాశాల సీపీడీసీ చైర్మన్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ తోట రమేశ్, అధ్యాపకులకు అందించి అభినందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈప్రాంత విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు పెంపొందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.4 కోట్ల నిధులతో విద్యార్థులకు ఉమెన్ హాస్టల్ వసతి మంజూరైందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.