
ఎల్కతుర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం వెళ్తున్న రవీందర్‌సింగ్
రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్
చైర్మన్ రవీందర్‌సింగ్
ఎల్కతుర్తి: రైతులు పండించిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన గన్నీబ్యాగుల గోదాంను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్‌ఓలు గౌరీశంకర్, విజయలక్ష్మి, డీటీ కృష్ణ తదితరులు ఉన్నారు.