
విద్యుత్ వెలుగుల్లో హనుమకొండ కలెక్టరేట్
హన్మకొండ అర్బన్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ సాధించుకుని పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరుతో వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం నుంచి 22వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలిరోజు హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి పోలీస్ వందనం స్వీకరించనున్నారు. పదేళ్ల పండుగలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రం సిద్ధించాక చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, అమరుల యాది, తెలంగా ణ నాడు–నేడు కార్యక్రమాలపై ప్రచారం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాల్లో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేయనున్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టనున్నారు.
నగరం ముస్తాబు..
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధా న కూడళ్లు విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్నాయి. అధికారిక వేడుకలకు పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. అమరవీరుల స్తూపం, కలెక్టరేట్, కలెక్టర్ నివాసం, అమరవీరుల కీర్తి స్తూపం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ పతాక ఆవిష్కరణ చేయనున్నారు.
నేటి నుంచి దశాబ్ది ఉత్సవాలు
ప్రభుత్వ కార్యాలయాలకు
దీపకాంతులు
నేడు పరేడ్ గ్రౌండ్‌లో పతాకాన్ని ఆవిష్కరించనున్న చీఫ్‌విప్
అమరుల యాది.. తెలంగాణ నాడు–నేడు కార్యక్రమాలు
ప్రభుత్వ పథకాలపై
విస్తృత ప్రచారం

హనుమకొండలోని అమరుల కీర్తి స్తూపం

పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు

విద్యుత్ వెలుగుల్లో ఎన్పీడీసీఎల్ కార్యాలయం