
ఉత్సవాల లోగోను ఆవిష్కరిస్తున్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు
కరీమాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజలూ భాగస్వాములు కావాలన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై హంటర్‌రోడ్ గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కార్యక్రమాల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు శ్రీవత్స, అశ్వినితానాజీ వాకడే, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, ఆర్డీఓ మహేందర్‌జీ, ఏసీపీ బోనాల కిషన్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
టెక్స్‌టైల్ పార్కును సందర్శించిన కలెక్టర్
సంగెం: సంగెం, గీసుకొండ మండలాల పరిధి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య గురువారం సాయంత్రం సందర్శించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న నిర్వహించనున్న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని టెక్స్‌టైల్ పార్కు ఆవరణలో జిల్లా వ్యాప్త సభ నిర్వహించడానికి అనువైన స్థలం, అసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. పారిశ్రామిక ప్రగతి ఉట్టిపడేలా సభ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇండస్ట్రీస్ జీఎం నర్సింహమూర్తి, జోనల్ మేనేజర్ సంతోశ్‌కుమార్, సంగెం, గీసుకొండ తహసీల్దార్లు రాజేశ్వర్‌రావు, విశ్వనారాయణ పాల్గొన్నారు.
పైడిపల్ల్లిలో రైతు వేదిక..
వరంగల్: నగరంలోని 3వ డివిజన్ పైడిపల్లిలోని రైతు వేదికను గురువారం కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈరైతు వేదికలో ఒక రోజు కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో చేపట్టనున్న ఏర్పాట్లను ఆమె అధికారులతో కలిసి చర్చించారు. అనంతరం వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
కలెక్టర్ ప్రావీణ్య