
కాంతులీనుతున్న వరంగల్ కలెక్టరేట్ కార్యాలయ భవనం
కరీమాబాద్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు ఇరవై ఒక రోజుల పాటు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, కూడళ్లు విద్యుత్ దీపాల కాంతుల్లో తళుకులీనుతున్నాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో ఉదయం 8:40 నిమిషాలకు ఖిలా వరంగల్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన తర్వాత వరంగల్ ఐడీఓసీ గ్రౌండ్‌లో 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ ఉంటుంది. ఈ కార్యక్రమానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. వేడుకల సందర్భంగా ఇదివరకే అన్నిశాఖల అధికారులతో సమీక్షలు జరిపారు. వేడుకల్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేశారు.

ఖిలావరంగల్‌లోని అమరవీరుల స్మారక స్తూపం
