‘అభివృద్ధి’లో వేగం అవసరం | - | Sakshi
Sakshi News home page

‘అభివృద్ధి’లో వేగం అవసరం

Jun 2 2023 2:52 AM | Updated on Jun 2 2023 2:52 AM

మోడ్రన్‌ బస్‌ స్టేషన్‌ నమూనా - Sakshi

మోడ్రన్‌ బస్‌ స్టేషన్‌ నమూనా

సాక్షి, వరంగల్‌: దశాబ్ది ఉత్సవాల వేళ వరంగల్‌ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. రవాణాకు సంబంధించి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్టు స్థల సేకరణ పనుల్లో వేగిరం చేయాల్సిన అవసరముంది. వేలాది మందికి ఉపాధి కల్పించే కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో మరిన్ని తీసుకరావాల్సిన అవసరముంది. జిల్లా ప్రజలకు పరిపాలన అందించే ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ ని ర్మించాలి. వరంగల్‌లో నూతన బస్టాండ్‌ నిర్మించాల్సి ఉంది.

సూపర్‌ సేవల దిశగా..

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులకు 2021 జూన్‌లో సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. 20,76,000 ఎస్‌ఎఫ్‌టీ ఉన్న 24 అంతస్తుల్లో దాదాపు పది అంతస్తులు పూర్తయ్యాయి. దసరా నాటికి వీటిలో మెడికల్‌ పరికరాలు బిగించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా పని చేస్తున్నారు. మిగిలిన 14 అంతస్తుల భవనాలను జనవరి నాటికి ఆర్‌అండ్‌బీ అధికారులు, ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్మించనుంది. ఈఆస్పత్రిలో ఏక కాలంలో 2100 మంది రోగులకు సేవలందించేలా పడకలు ఉంటాయి. వీటిలో 800 వరకు సూపర్‌ స్పెషాలిటీ బెడ్స్‌ ఉండనున్నాయి. 36 రకాల సేవలు అందనున్నాయి. కిడ్నీలు, కాలేయం, గుండె సంబంధిత.. వివిధ జబ్బులతో ఆస్పత్రిలో చికిత్స పొందే రోగుల అటెంటెండ్స్‌ కోసం ధర్మశాల (దాదాపు 250 మంది ఉండేందుకు వీలుగా)ను అన్ని సౌకర్యాలతో నిర్మించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మోడ్రన్‌ బస్‌స్టేషన్‌కు కదలిక

బెంగళూరులోని ఇంటర్‌సిటీ బస్‌ టెర్మినల్‌ (ఐసీబీటీ) తరహాలో వరంగల్‌ మోడ్రన్‌ బస్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 32 ప్లాట్‌ఫామ్‌లు, మరో ఐదు అంతస్తుల్లో వ్యాపార, వినోద వసతులు ఉండేలా కాంప్లెక్స్‌లు అందుబాటులోకి తేనున్నారు. సెల్లార్‌లో పార్కింగ్‌ ఉండనుంది. అలాగే వ రంగల్‌ రైల్వేస్టేషన్‌, నియోకు అనుసంధానంగా వ రంగల్‌ బస్టాండ్‌ ఉండేలా అండర్‌ వాక్‌ లేదంటే స్కై వాక్‌ నిర్మించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశా రు. రెండునెలల క్రితం రూ.75కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం అధికారిక అనుమతులిచ్చింది. ‘కుడా’ త్వరలోనే పనులు మొదలుపెట్టనుంది.

ఎగరనివ్వాలి..

వరంగల్‌వాసుల చిరకాలవాంఛ అయిన మామునూరు ఎయిర్‌పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపనులు వేగిరం చేయాల్సిన అవసరముంది. అలాగే వరంగల్‌లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే నాయుడు పెట్రోల్‌ బంక్‌ నుంచి ఆరెపల్లి జంక్షన్‌ వరకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పదేళ్ల క్రితం నిర్మించాల్సి న భూసేకరణ సమస్యతో ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నిర్మాణ పనులు తొందరగా చేపట్టాలి. వరంగల్‌లోని ప్రధాన రహదారుల వెంట అండర్‌గ్రౌండ్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి.

మోడ్రన్‌ బస్‌స్టేషన్‌,

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు

వేగిరం చేయాలి

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు

ద్వారా వేలాది మందికి ఉపాధి

మామునూరు ఎయిర్‌పోర్ట్‌,

కలెక్టరేట్‌ నిర్మాణంలో అడుగులు పడాలి

నేటి నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

వేలాది మందికి ఉపాధి..

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో 300 ఎకరాల్లో ఓ కొరియన్‌ కంపెనీ, 150 ఎకరాల్లో కై టెక్స్‌ కంపెనీ, 50 ఎకరాల్లో గణేశ్‌ ఇండస్ట్రీస్‌ వచ్చాయి. వందలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఇటీవల కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును కేంద్రం మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అప్పరెల్‌ (మిత్ర)లో అవకాశం కల్పించడంతో మౌలికసదుపాయాలు మరిన్ని పెరిగి ఇంకా కంపెనీలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో వేలాది మందికి ఉపాధి లభించనుంది.

నిర్మాణంలో ఉన్న ‘సూపర్‌’ హాస్పిటల్‌(ఫైల్‌)1
1/1

నిర్మాణంలో ఉన్న ‘సూపర్‌’ హాస్పిటల్‌(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement