సంగెం: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును సందర్శించడానికి కేంద్ర సహకార శాఖ మంత్రి బీఎల్.వర్మ ఈనెల 3వ తేదీన నగరానికి రానున్నారని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తెలిపారు. గురువారం టెక్స్‌టైల్ పార్కు పైలాన్‌ను పార్టీ పరకాల ఇన్‌చార్జ్ డాక్టర్ విజయచందర్‌రెడ్డి, నేతలతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలు చేరుతున్నాయా లేదా పరిశీలించడానికి ప్రవాస్ యోజన పథకంలో ప్రతీ పార్లమెంట్‌కు ఒక కేంద్ర మంత్రిని నియమించారని, అందులో భాగంగా బీఎల్ వర్మ పర్యవేక్షణకు వస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు కుసుమ సతీశ్, గట్టికొప్పుల రాంబాబు, మునుకుంట్ల రంజిత్, మాదరపు శివ, హరిశంకర్, శ్రీనివాస్, క్రాంతికుమార్, ప్రసాద్, వెంకటేశ్ అశ్వినికుమార్, కుమారస్వామి పాల్గొన్నారు.
3, 4 తేదీల్లో మెగా జాబ్ మేళా
కాళోజీ సెంటర్: యువతకు ఉద్యోగావకాశాలు అందించేందుకు 200కు పైగా కంపెనీలతో ఎన్‌ఎస్‌డీసీ వారిచే ఈనెల 3, 4 తేదీల్లో కౌశల్ మహోత్సవ్ (మెగా జాబ్ ఫెయిర్)ను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవెలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆదేశాల మేరకు ఈజాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్‌ఎస్‌టీఐ, శివమ్‌రోడ్డు, విద్యానగర్‌లో ఉంటుందని, ఎస్సెస్సీ, ఆపై చదువుకున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. మేళాలో పాల్గొనడానికి ఎన్‌ఎస్‌డీసీ కౌశల్ మహోత్సవ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.
55 మందికి పురస్కారాలు
కరీమాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 55 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. అంకితభావం, ప్రతిభ ఆధారంగా వా రిని ఎంపిక చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాలు అందించనున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన డీసీపీ
కరీమాబాద్: వరంగల్ ఓ సిటీ ఎదురుగా ఉన్న ప్రదేశంలో నిర్వహించనున్న దశాబ్ది వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం సాయంత్రం వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ పుల్లా కరుణాకర్ పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్న ప్రదేశంలో జాతీయ పతాకావిష్కరణ చేయనుండడంతో మామునూరు ఏసీపీ కృపాకర్, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, ఏఆర్ ఏసీపీ నాగయ్య, మిల్స్‌కాలనీ సీఐ ముష్క శ్రీనివాస్‌తో కలిసి భద్రతాపరమైన చర్యలను పర్యవేక్షించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వేదిక ప్రాంతంలో బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.