గండ్ర జ్యోతి కాళ్లపై పడిన లక్ష్మి
శాయంపేట : మండలంలోని మైలారం గ్రామం ఎనిమిదవ వార్డులో తమ ఇళ్లకు వెళ్లడానికి రోడ్డు వేయించాలని పల్లెబోయిన లక్ష్మి అనే మహిళ వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి కాళ్లపై పడి వేడుకుంది. గ్రామంలో బుధవారం జరిగిన ఎస్సీ కార్పొరేషన్ పథకాల అవగాహన సదస్సులో ఆమె పాల్గొని వెళ్తుండగా లక్ష్మీ తన గోడును వెళ్లబోసుకుంది. తమ కాలనీలో ఉన్న అధికార పార్టీ నాయకులు రోడ్డును ఆక్రమించేలా ప్రహారి నిర్మాణాలు చేపట్టారని, ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపింది. స్పందించిన జెడ్పీ చైర్‌పర్సన్ మరోసారి గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
జెడ్పీ చైర్‌పర్సన్
కాళ్లపై పడి వేడుకున్న మహిళ


