అసత్య ప్రచారం తగదు | - | Sakshi
Sakshi News home page

అసత్య ప్రచారం తగదు

Sep 18 2026 1:21 AM | Updated on Sep 18 2026 1:21 AM

కొత్తకోట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా మతోన్మాదులు అసత్య ప్రచారం చేయడం తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. గురువారం కొత్తకోటలో నిర్వహించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ పోరాటం చరిత్రలో చెరగని అధ్యాయమని అన్నారు. దోపిడీ, అణచివేత, అంటరానితనం, కులవివక్షకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, కమ్యూనిస్టులు సాగించిన పోరాటం చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్‌, నందిమళ్ల నాగన్న, చీర్ల వెంకటేశ్‌, గొల్ల వెంకటయ్య, యాదయ్య, కురుమన్న, రఫిక్‌, రమేశ్‌, భాస్కర్‌, రాములు, రాజు, శివన్న, బాబు, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక వ్యవసాయపద్ధతులతో లాభాలు

వనపర్తి రూరల్‌: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందాలని డీఏఓ ఆంజనేయులు సూచించారు. జిల్లా కేంద్రం సమీపంలోని నాగవరం రైతువేదికలో గురువారం నిర్వహించిన జిల్లా రైతు సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు సమగ్ర పోషక, ఎరువులు, తెగుళ్ల, నీటి యజమాన్య పద్ధతులు అనుసరించి.. సేంద్రియ వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. పంటల సాగులో శాసీ్త్రయ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం మన గ్రోమోర్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నానో డీఏపీ ,నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. నానో ఎరువులతో పంట సమర్థవంతంగా పోషకాలను గ్రహిస్తుందన్నారు. గుళికల రూపంలో ఎరువులను పొలాల్లో చల్లడం ద్వారా కొంతమేర వృథా జరిగే అవకాశం ఉంటుందన్నారు. నానో ఎరువులు వినయోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సలహ కమిటీ వైస్‌చెర్మన్‌ సూర్య చంద్రారెడ్డి, ఆత్మ డిప్యూటీ డైరెక్టర్‌ హైమావతి, వ్యవసాయశాఖ అధికారులు ప్రభాకర్‌రెడ్డి, తిప్పే స్వామి, కుర్మయ్య పాల్గొన్నారు.

పల్లీ @ రూ.7,089

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు గురువారం 194 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.7,089, కనిష్టంగా రూ.5,270, సరాసరిగా రూ.5,719 ధరలు లభించాయి. అలాగే 13 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్‌ రూ.7,021 ఒకే ధర పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement