గ్రామంలోని 10 మంది రైతులం 15 ఎకరాలు సాగు చేసుకోవడానికి 70 ఏళ్లుగా సర్వేనంబర్ 467 ప్రభుత్వ భూమిలో నుంచి పొలానికి వెళ్తున్నాం. గ్రామానికి చెందిన రైతు బండారు చంద్రయ్య దారిని ఆక్రమించి రాళ్లతో గోడ కట్టి రాకపోకలు నిలిపివేశారు. మోఖాపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాం. – పెద్దదగడ రైతులు, చిన్నంబావి మండలం
భూ పరిహారం చెల్లించాలి..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండేళ్ల కిందట గ్రామశివారులోని 25 మంది రైతుల భూముల్లో నుంచి డీ–5 కాల్వను తవ్వారు. కాల్వ తవ్వకంతో 22 ఎకరాల భూమి కోల్పోయాం. ఇప్పటి వరకు నష్ట పరిహారం చెల్లించ లేదు. మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాలని కలెక్టర్‌కు విన్నవించాం.
– పర్వతాపూర్ రైతులు, ఖిల్లా ఘనపురం మండలం
●


