చిన్నంబావి: ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనత పార్టీ (సీజేపీ) ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మలిదశ ఉద్యమానికి శ్రీకారం చూడతామని.. ఈసారి కచ్చితంగా న్యాయం జరిగే వరకు పొరాడుతామని, అవసరమైతే ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీశైలం నిర్వాసితులు వివరించారు. సోమవారం మండలంలోని పెద్దమారూర్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. తరాలు మారినా నిర్వాసితుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా.. సమస్యను ఎన్నికల హామీగానే తీసుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చిన మరుక్షణం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి తమకు న్యాయం చేస్తామని చెప్పడం తప్ప చేతల్లో కనిపించడం లేదని, మంత్రి 30 ఏళ్లు అధికారంలో ఉన్నా తమకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, దాగోజి గోవిందు, షబ్బీర్, సోమ భాస్కర్, బాలయ్య, మైనుద్దీన్, మహబూబ్‌పాషా, జహంగీర్‌పాషా, రంగస్వామి, కొండన్న, రాఘవేంద్ర శెట్టి, కాంతయ్య, గూడెం బాలస్వామి, పెద్దమారూర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.


