నీటి ధార ఎక్కడ..? | - | Sakshi
Sakshi News home page

నీటి ధార ఎక్కడ..?

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

చెరువులు, కుంటల్లో తగ్గిన నీటి మట్టం

చర్యలు చేపట్టాలి...

ప్రతి వేసవిలో తాగునీటి కష్టాలు వస్తూనే ఉన్నాయి. దీనికితోడు వానాకాలం వచ్చిన వర్షాలు కురవక పోవడంతో గ్రామాల్లో నీటి సరఫరాలో కోతలు పెడుతున్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పాలకులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి రోజు నీటిని అందించాలి.

– మండ్ల రామకృష్ణ, మాజీ కౌన్సిలర్‌, ఆత్మకూర్‌.

భూగర్భ జలం తగ్గుతోంది

ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండడంతో పాటు ఆశించిన వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. వరి పంటలు ఎక్కువగా సాగు చేస్తుండడంతో నీటి వినియోగం పెరిగి బోర్ల వాడకం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోతున్నాయి. ప్రతి ఇంటికి ఒక ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవడంతో పాటు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలలో నీరు నిల్వ ఉంటే భూగర్భజలం పెరుగుతుంది.

– ఉమేష్‌, భూజల విజ్ఞానవేత్త, వనపర్తి

ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం

జిల్లాలోని తాగునీటి పథకాల నుంచి నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటి సరఫరా చేపడుతున్నాం. తాగునీటి పథకాలను ప్రస్తుతం నీటి కొరత సమస్యలు లేదు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. ముందస్తుగా 1,150 బోర్లు, 450 చేతిపంపులతో పాటు ట్యాంకర్లను వినియోగిస్తున్నాం. జిల్లా ప్రజలు తాగునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

– అంజద్‌పాష, ఈఈ, మిషన్‌ భగీరథ

ఆత్మకూర్‌: వానాకాలం ప్రారంభమైన నెల గడుస్తున్నా.. జిల్లాలో వర్షం పడిన దాఖలాలు లేవు. దీంతో చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గిపోతుంది. దీంతో భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు ఏకంగా 2 టీఎంసీలకు పడిపోగా.. రామన్‌పాడు రిజర్వాయర్‌లో కూడా ఆశాజనకంగా ఏమి లేదు. ఈ కారణంగా తాగునీటి ముప్పు ముంచుకొస్తుంది. తాగునీటి ఇబ్బందులు రానీయకుండా ఎండాకాలంలో మిషన్‌ భగీరథ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. కానీ ప్రస్తుతం ఎండల తీవ్రత, గాలుల వేగానికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందంటున్నారు. జిల్లాలోని 6.46 లక్షల మంది అవసరాలు తీర్చేందుకు నిత్యం మిషన్‌ భగీరథ పథకం ద్వార 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీలకు 27.6 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్లు ఫర్‌ డే), గ్రామాలకు 48.435 ఎంఎల్‌డీ నీటిని అందిస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌పైనే తాగునీటి పధకాలు కొనసాగుతున్నాయి. జూలైలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యమ్నాయంగా మార్గాలను చూసు కుంటూ బోర్లు, చేతిపంపులు, ట్యాంకర్లను సిద్ధం చేశామని అధికారులు పేర్కొంటున్నారు.

వనపర్తి జిల్లాలో..

2 టీఎంసీలకు పడిపోయిన జూరాల నిల్వలు

ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు

255 గ్రామాలు, 6.46 లక్షల జనాభా..

నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటి సరఫరా

తాగునీటి సరఫరా..

భూగర్భ జలాల వివరాలు (మీటర్లలో..)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement