మెరుగైన వైద్య సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలు అందించాలి

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

వనపర్తి రూరల్‌: రాష్ట్రంలో నిరుపేదలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన, ఆధునిక యాంత్రీకరణ సేవలు అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. సీపీఎం నాయకులతో కలిసి ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. జనరల్‌ వార్డులోని రోగులతో మాట్లాడి, అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మందుల దుకాణం, రక్త పరీక్షల కేంద్రం, భోజనశాలను సందర్శించి నాణ్యతను పరిశీలించారు. ఆస్పత్రిని పర్యవేక్షిస్తున్న ఆర్‌ఎంఓ ప్రసాద్‌తో వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో జరుగుతున్న లోపాలు, అవసరమైన నియామకాలను, స్థానిక డిమాండ్‌ను పరిశీలించేందుకు సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి, తమ దృష్టికి వచ్చిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేందుకు రెండు నెలల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులపై పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యే, మంత్రులు, సీఎం స్థాయి వరకు తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జబ్బార్‌, బాల్‌రెడ్డి, గోపి, మండ్ల రాజు, పట్టణ కార్యదర్శి పరమేవ్వరచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement