కొత్తకోట రూరల్: రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు మండలంలోని అమడబాకుల రైతువేధికలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. పాలెం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ప్రొ. డా. ప్రగతికుమారి హాజరై సాగునీటి పొదుపు పద్ధతులు, వాతావరణ అనుకూల పంటల సాగు విధానం, ఎరువుల సమతుల్యత, ఆధునిక వ్యవసాయంపై రైతులకు వివరించారు. తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే పద్ధతులను అవలంబించాలని సూచించారు. అనంతరం రైతుల సమస్యలు తెలుసుకొని సస్యరక్షణ చర్యలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కొత్తకోట వ్యవసాయ అధికారి జాస్మిన్, ఏఈఓ రవీందర్‌రెడ్డి, కళాశాల విద్యార్థులు కె.నర్సింహ, చంద్రవర్ధన్, సర్పంచ్ గాయత్రి, రైతులు పాల్గొన్నారు.


