వడ్ల బస్తాలతో బారులు | - | Sakshi
Sakshi News home page

వడ్ల బస్తాలతో బారులు

May 22 2026 12:36 AM | Updated on May 22 2026 12:36 AM

వీపనగండ్ల గోదాం వద్ద బారులుతీరిన వరిధాన్యం వాహనాలు

వీపనగండ్ల: మండల కేంద్రంలోని గోదాం వద్ద గురువారం వరిధాన్యం వాహనాలు బారులుతీరాయి. సుమారు 150 వాహనాల్లో వడ్ల బస్తాలను తీసుకురాగా.. అన్‌లోడ్‌ చేసేందుకు సరిపడా హమాలీలు లేకపోవడంతో 1.5 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. 5వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యంగల గోదాంకు అమరచింత, ఆత్మకూర్‌ తదితర మండలాల నుంచి పెద్ద మొత్తంలో లారీలు, ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. అయితే బీహార్‌కు చెందిన 18 మంది హమాలీలు మాత్రమే ఉండటంతో అన్‌లోడ్‌ చేయడం కష్టసాధ్యంగా మారింది. పరిసర గ్రామాల్లోని హమాలీలను అన్‌లోడ్‌ చేసేందుకు కోరినా ఎవరూ రావడం లేదని తహసీల్దార్‌ ఖాజామైనొద్దీన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కామన్‌, డాన్‌ రకాల ధాన్యాన్ని మాత్రమే అన్‌లోడ్‌ చేస్తుండటంతో మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న స్థానిక సీపీఎం నాయకులు గోదాం వద్దకు చేరుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

గోదాం వద్ద హమాలీలు లేక నిలిచిన వాహనాలు

Advertisement
 
Advertisement
Advertisement