పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

వనపర్తిటౌన్‌: అందరి భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఏఎంఓ మహానంది, సీఎంఓ ప్రతాప్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో వేసవి శిబిరంలో భాగంగా బుధవారం నేషనల్‌ గ్రీన్‌కార్‌ప్స్‌ (ఎన్‌జీసీ) జిల్లా కో–ఆర్డినేటర్‌ ఐ.సుదర్శన్‌రావు ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన సదస్సు నిర్వహించగా వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పర్యావరణాన్ని భద్రంగా కాపాడితే మంచి గాలి, నీరు భవిష్యత్‌ తరాలకు అందుతాయన్నారు. నేటి బాలలే రేపటి యువత.. విద్యార్థులు కచ్చితంగా పర్యావరణంపై అవగాహన కలిగి ఉండి విధిగా మొక్కలు నాటడం అలవర్చుకోవాలని, భూగర్భ జలాలను కాపాడాలని, అడవుల సంరక్షణ గురించి తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, విద్యుత్‌ ఆదా, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గింపుపై విద్యార్థులు నిర్వహించిన స్కిట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు పర్యావరణంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం సుదర్శన్‌రావు విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ వాడమని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేష్‌ కుమార్‌, నిరీషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement