సాగునీరు పారేలా...! | - | Sakshi
Sakshi News home page

సాగునీరు పారేలా...!

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

జూరాల ఎడమ, అనుబంధ కాల్వల్లో పూడికతీత

అమరచింత: ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ, అనుబంధ కాల్వల్లో పూడికతీత పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కాల్వల్లో నీటిసరఫరా నిలిచిపోవడంతో రోజు ఉపాధి కూలీలతో పూడికతీతతో పాటు ముళ్లపొదల తొలగింపు పనులు కొనసాగుతోంది. యాసంగిలో ప్రధాన ఎడమకాల్వ ద్వారా కేవలం రామన్‌పాడు రిజర్వాయర్‌ వరకు 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించడంతో మిగిలిన ఆయకట్టు కాల్వలు నీటి ప్రవాహం లేక ఎండుముఖం పట్టాయి. ఈసారి వేసవిలో కాల్వల మరమ్మతులకు ప్రతిపాదనలు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన పీజేపీ అధికారులు జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను ఆయా మండలాల్లోని నీటిపారుదలశాఖ ఏఈలు ఎంపీడీఓలను సంప్రదించి కాల్వల్లో ఉపాధి పనులు చేపట్టాలని కోరడంతో సమీప గ్రామాల కూలీలతో పనులు చేపడుతున్నారు. వచ్చే వర్షాకాలంలో సాగునీరు సాఫీగా ముందుకు పారే విధంగా ప్రధాన, పిల్ల కాల్వల్లో సైతం పూడిక తొలగించి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా అధికారులు పనులు చేయిస్తున్నారు.

నీటిపారుదలశాఖ సిఫార్సులతో ఉపాధిహామీ పథకంలో..

ఎంపీడీఓల పర్యవేక్షణలో ఊపందుకున్న పనులు

వేసవిలో మరమ్మతులు లేకపోవడంతోనే..

Advertisement
 
Advertisement
Advertisement