ఇబ్బందులు తొలగనున్నాయి.. | - | Sakshi
Sakshi News home page

ఇబ్బందులు తొలగనున్నాయి..

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

జూరాల ప్రధాన ఎడమ కాల్వలో పూడికతీత పనులు చేపట్టడంతో సాగునీరు సాఫీగా చివరి ఆయకట్టు వరకు పారే అవకాశం ఉంది. కాల్వలో ఒండ్రుమట్టితో పాటు రాళ్లు, ముళ్లపొదలు ఏళ్లుగా తొలగించకపోవడంతో సాగునీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. వీటిని తొలగించడంతో సమృద్ధిగా పంటలకు అందే అవకాశం ఉంది.

– హన్మంతు, రైతు, నందిమళ్ల

‘అమరచింత’ కాల్వలో సైతం..

జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం పరిధిలో మస్తీపురం, మూలమళ్ల, సింగంపేట, ఖానాపురం, పాంరెడ్డిపల్లి గ్రామాలతో పాటు అమరచింతకు సాగునీరు అందుతుంది. ఎత్తపోతల కాల్వలో సైతం పూడితీత పనులు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతంలో ఉపాధి పనులు లేకపోవడంతో మిగిలిన గ్రామాల్లో విస్తరించిన కాల్వలో ఉపాధి కూలీలతో పూడికతీత పనులు చేపట్టడం సంతోషం.

– సత్యారెడ్డి, రైతు, అమరచింత

కూలీలకు ఉపాధి కల్పించేందుకు..

జూరాల ఎడమ కాల్వలో పూడికతీత పనులు చేపట్టమని నీటిపారుదలశాఖ అధికారులు కోరడంతో ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలతో పూడికతీత పనులు చేపడుతున్నాం. మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తరించిన ఎడమ కాల్వతో పాటు అమరచింత, చంద్రగడ్‌ ఎత్తిపోతల కాల్వల్లో పేరుకుపోయిన పూడిక, ముళ్లపొదలు తొలగిస్తున్నాం.

– శ్రీనివాసులు, ఎంపీడీఓ, అమరచింత

Advertisement
 
Advertisement
Advertisement