వనపర్తి రూరల్: రైతులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. సోమవారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డులోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి చేశారు. ధాన్యం సేకరణ, తూకం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్‌మిల్లులు, గోదాములకు తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి దశలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.
‘ఖిల్లా’ మార్కెట్ చైర్‌పర్సన్‌గా క్యామ నవనీత
ఖిల్లాఘనపురం: ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాలకు కలిపి ఖిల్లాఘనపురంలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా పట్టణానికి చెందిన క్యామ నవనీతను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం జీఓ జారీచేసింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా పెద్దమందడి మండలం దొడగుంటపల్లికి చెందిన కొత్తకాపు వెంకటేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్లుగా దిండు రవీందర్, డి.బాలరాజు, ముప్పురి రత్నయ్య, తలకొండపల్లి రఘునాథ్, బయన్న, పాత్లావత్ బాషా, రవీందర్‌రెడ్డి, మర్యాద బాలకృష్ణారెడ్డి, బత్తుల దుర్గయ్య, ఎండీ ఖాజా నయీముద్ధీన్, రవీంద్రనాథ్, తూము రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.


