జిల్లావ్యాప్తంగా 14 వేల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ లక్ష్యం నిర్దేశించినా.. ఇప్పటికింకా 50 శాతానికి సైతం చేరలేదని రైతులు, రైతు కూలీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సేకరించిన ధాన్యంలో చాలావరకు కేంద్రాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. వరి, మొక్కజొన్న కొనుగోళ్లు ఏకకాలంలో కొనసాగుతున్నాయని.. వరి ధాన్యాన్ని రైస్‌మిల్లులు, గోదాంలలో నిల్వ చేస్తుండటంతో మొక్కజొన్నకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. రైతులకు చేసిన డబ్బుల చెల్లింపుల వివరాలు చెప్పేందుకు కూడా మార్క్‌ఫెడ్ అధికారులు అనాసక్తి కనబరుస్తుండటం గమనార్హం. ఇప్పటికీ వనపర్తి మార్కెట్‌యార్డులో భారీగా మొక్కజొన్న రాశులు కనిపిస్తున్నాయి.


