వనపర్తి: కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలించడానికి కాంట్రాక్టు లారీలే కాకుండా ఇతర వాహనాలను కూడా వినియోగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రవాణా కమిషనర్ ఇలంబర్తి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, రవాణాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించగా.. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్‌తో పాటు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా రవాణాశాఖ అధికారి మానస, పౌర సరఫరాల సంస్థ డీఎం ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో ధాన్యం తరలింపునకు కాంట్రాక్టు లారీలు కాకుండా అదనంగా రవాణాశాఖ చొరవతో 10 డీసీఎంలు, 20 ట్రాక్టర్లు సమకూర్చినట్లు వివరించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్


