వనపర్తిటౌన్: వైకల్యాన్ని బలహీనతగా భావిస్తే జీవితంలో ఏదీ సాధించలేమని.. బలంగా మార్చుకోవాలని జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘనీ కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కేడీఆర్‌నగర్‌లో ఉన్న భవిత కేంద్రంలో జిల్లా విద్యాశాఖ, అల్మింకో సంస్థ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో 61 మంది ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ట్రై సైకిల్స్, ఎంఆర్ కిట్లు (బుద్ధిమాంధ్యత), హియరింగ్ పరికరాలు, టీఎల్‌ఎం కిట్లు, వివిధ రకాల పరికరాలను మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మానసిక స్థైర్యంతో వైకల్యాన్ని ఎదిరించి పోరాడితే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థులు విలువైన కిట్లను జాగ్రత్తగా వినియోగించుకుంటూ అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చుకోవాలని సూచించారు. మార్కెట్‌యార్డ్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. వైలక్యాన్ని చూసి భయపడితే ఎలాంటి విజయాలను తాకలేరని, భయాన్ని వీడి నేటి సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు చిన్నతనం నుంచే సిద్ధపడాలన్నారు. కిట్లను వినియోగించుకోవడంతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అరుణ జ్యోతి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాప్‌రెడ్డి, మండల విద్యాధికారి మద్దిలేటి, సామాజికవేత్త గంధం నాగరాజు, ఐఆర్పీలు, అల్మింకో ప్రతినిధులు సోనీ యాదవ్, అస్మిత్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


