పోరాటాలకు ఊపిరిపోసిన ప్రజా నాట్యమండలి | - | Sakshi
Sakshi News home page

పోరాటాలకు ఊపిరిపోసిన ప్రజా నాట్యమండలి

May 16 2026 12:45 AM | Updated on May 16 2026 12:45 AM

వనపర్తి రూరల్‌: దేశ స్వాతంత్య్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ప్రజా పోరాటాలను ముందుకు నడిపించిన ఘన చరిత్ర ప్రజా నాట్యమండలి సొంతమని ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాయంలో ప్రజా నాట్యమండలి 4వ మహాసభను పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. 1943లో ప్రజా నాట్యమండలి ఏర్పడిందని, దేశ స్వాతంత్య్రం కోసం ఆటపాటలతో ప్రజల్లో స్వాతంత్య్ర ఆకాంక్షను రగిలించి పోరాటాల్లోకి నడిపించిందన్నారు. ప్రజలను చైతన్యం చేసి నిజాం పాలనను కూల్చిందన్నారు. ప్రజా సమస్యలపై జరిగిన పోరాటాల్లోను ప్రజా నాట్యమండలి కీలక పాత్ర పోషించిదన్నారు. వచ్చే 5వ మహాసభ నాటికి జిల్లా ప్రజనాట్య మండలిని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. నాయకులు విజయరాములు, వంకా గోపాల్‌, ఎర్రన్న, కళావతమ్మ, రమేష్‌, విజయుడు, శ్రీరామ్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement