అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే

May 14 2026 12:13 AM | Updated on May 14 2026 12:13 AM

గోపాల్‌పేట: తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తోందని.. ఇందుకు నిదర్శనమే ఇందరమ్మ ఇళ్ల పథకమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇందరమ్మ ఇల్లు నిర్మించుకున్న మునిగల్ల నాగమ్మ గృహ ప్రవేశానికి ఆయన హాజరై లబ్ధిదారుకు కొత్త దుస్తులు అందజేసి మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు ఇల్లు నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారుకు చీరసారె ఇస్తున్నామని చెప్పారు. వచ్చే నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని.. రానివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేదల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement