ఉపాధి కూలీల సంఖ్య పెంచాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజు పనులకు వస్తున్న కూలీల హాజరు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరుసటి రోజు పెంచే యత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1.20 లక్షల జాబ్‌కార్డులు ఉండగా.. ఏటా సుమారు 15 వేల మంది పనుల్లో పాల్గొనేవారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్యను 30 వేల నుంచి 33 వేల వరకు పెంచి గ్రామాల్లో సమృద్ధిగా ఉపాధి పనులు చేపట్టి కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇందుకోసం గ్రామంలోని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత సహకారం తీసుకుంటున్నారు.


