చివరిరోజు.. నామినేషన్ల జోరు
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల మూడోవిడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగిసింది. జిల్లాలోని శ్రీరంగాపురం, పెబ్బేరు, వీపనగండ్ల మండలాల్లో ఈ ప్రక్రియ రాత్రి 11.30 సమయంలో ముగియగా.. చిన్నంబావి, పాన్‌గల్ మండలాల్లో అర్ధరాత్రి 12 దాటినా అభ్యర్థులు నామినేషన్ల సమర్పణకు క్యూలైన్‌లో నిలుచున్నారు. చిన్నంబావి మండలంలోని కొన్ని క్లస్టర్లలో మధ్యాహ్నం మూడు తర్వాత వందకుపైగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు బారులుతీరినట్లు సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి 12 వరకు అందిన సమాచారం మేరకు వీపనగండ్ల మండలంలోని 14 సర్పంచ్ స్థానాలకు 106 నామినేషన్లు, 130 వార్డు స్థానాలకు 336 నామినేషన్లు.. శ్రీరంగాపురం మండలంలో 8 సర్పంచ్ స్థానాలకు 60, 82 వార్డు స్థానాలకు 211.. పెబ్బేరు మండలంలో 20 సర్పంచ్ స్థానాలకు 144 నామినేషన్లు, 182 వార్డు స్థానాలకు 389 నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. మూడోవిడతలోని 87 సర్పంచ్ స్థానాలు, 806 వార్డు స్థానాలకు దాఖలైన మొత్తం నామినేషన్ల వివరాలు శనివారం ఉదయం అధికారికంగా వెలువడనున్నాయి.
అర్ధరాత్రి దాటినా కొనసాగిన పరిశీలన


