గ్రామాల అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
ఖిల్లాఘనపురం: గ్రామాల అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను సర్పంచ్‌లు, వార్డుసభ్యులుగా గెలిపించాలని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య అధ్యక్షతన ఆయన నివాసంలో నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తమ పాలనలో నియోజకవర్గంతో పాటు మండల కేంద్రం, గ్రామాలు అభివృద్ధి చేసి ప్రగతిపథంలో నిలిపినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి మండల కేంద్రంలో క్యామ అజంత విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉద్యాన కళాశాలలో ప్రపంచ నేలల దినోత్సవం
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో శుక్రవారం ప్రపంచ నేలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు భూసార పరీక్షకు మట్టిని సేకరించే విధానాన్ని క్షేత్రస్థాయిలో విద్యార్థులకు వివరించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డా. షహనాజ్ మాట్లాడుతూ.. పంటలకు విచక్షణారహితంగా ఎరువులు, పురుగు మందులు వినియోగించరాదని, పచ్చిరొట్ట ఎరువులు వాడి నేలసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. నేలల పరిరక్షణకు కంకణబద్దులై ఉండాలని మృత్తికశాస్త్ర ప్రొఫెసర్ మాధవి విద్యార్థులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి భాస్కర్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సమస్యాత్మక పోలింగ్
కేంద్రాలపై నజర్
మదనాపురం: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని అజ్జకొల్లు, కొత్తపల్లి, దుప్పల్లి, బౌసింగ్‌తండా, కొన్నూర్‌తండాలో ఆయన పర్యటించి భద్రతా చర్యలు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్ 163 (పాత 144 సెక్షన్) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎవరైనా గొడవలు సృష్టించినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
రామన్‌పాడులో
తగ్గిన నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిచిపోగా.. సమాంతర కాల్వలో 649 క్యూసెక్కుల వరద చేరిందన్నారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 454 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
గ్రామాల అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
గ్రామాల అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం


