చారిత్రక వైభవం..
నాటి చరిత్రకు సాక్ష్యంగా నేటికీ నిలిచిన కట్టడాలు
తెలకపల్లి మండలంలోని గడ్డంపల్లి గ్రామంలోని పురాతన గడి ఇది. మొదట్లో పాత గ్రామం మరోచోట ఉండేది. గ్రామంలో అంటువ్యాధి సోకి మరణాలు పెరిగాయి. దీంతో గ్రామంలో ఉన్నవారందరూ మరో చోటుకి తరలివెళ్లాలని ఓ గడ్డం సాధువు చెప్పాడట. గడ్డంతో ఉన్న సాధువు చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన చోటుకి వెళ్లడంతో అది గడ్డంపల్లి అయింది. ఈ ఊరిలోని గడి కేంద్రంగా రెడ్డిరెడ్డి వంశస్తులు చుట్టుపక్కల 8 ఊళ్లతో కలిపి పాలించారు. వట్టెం కేంద్రంగా పాలించిన రెడ్డిరెడ్డి వంశస్తులు వీరి బంధువులే. ప్రస్తుతం ఈ గడి శిథిలావస్థకు చేరుకుంది.
చారిత్రక వైభవం..
చారిత్రక వైభవం..


