జోనల్‌స్థాయిలో సత్తాచాటిన క్రీడాకారులు
గోపాల్‌పేట: మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో గురువారం ప్రారంభమైన 11వ జోనల్‌స్థాయి క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ముగిశాయి. క్రీడపోటీల్లో నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు చెందిన సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. గతేడాది నాలుగు రోజుల పాటు కొనసాగిన జోనల్‌స్థాయి క్రీడాపోటీలు ఈ ఏడాది మూడు రోజుల్లోనే ముగించారు. క్యారమ్స్‌లో గోపాల్‌పేట మొదటిస్థానంలో నిలువగా మన్ననూరు రెండోస్థానంలో నిలిచింది. చెస్‌లో కొత్తకోట మొదటి స్థానం, గోపాల్‌పేట రెండోస్ధానం.. వందమీటర్ల పరుగుపందెంలో పెద్దమందడి మొదటిస్థానంలో నిలువగా పెద్దమందడికి చెందిన విద్యార్థిని రెండోస్థానంలో నిలిచింది. 200 మీటర్ల పరుగు పందెంలో మొదటిస్థానం, రెండోస్థానంలో పెద్దమందడికి చెందిన విద్యార్థులే నిలవడం గమనార్హం. 400, 800, 1500, మూడు వేల మీటర్ల పరుగుపందెంలో నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన విద్యార్థినులు మొదటి స్థానంలో నిలిచారు. డిస్కస్‌త్రో, షాట్‌పుట్, లాంగ్‌జంప్ పోటీల్లో పెద్దమందడి విద్యార్థినులు మొదటిస్థానంలో నిలిచారు. హైజంప్‌లో వంగూర్, వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో వెల్దండకు చెందిన కీర్తన ప్రతిభ కనబర్చారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో ఓవరాల్‌గా పెద్దమందడి 80 పాయింట్లు సాధించింది. శనివారం జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా డీసీఓ ప్రమోద, ఎంఈఓ చంద్రశేఖర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడాపోటీల నిర్వహణకు సహకరించిన వారికి ప్రిన్సిపాల్ ఆరోగ్యం ధన్యవాదములు తెలిపారు.


