విద్యావ్యవస్థలో మార్పు అమరుల త్యాగఫలమే..
వనపర్తి విద్యావిభాగం: శాసీ్త్రయ విద్యా విధానం, సమాజ మార్పు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాడుతూ అమరులైన విద్యార్థుల త్యాగం చిరస్మరణీయమని.. వారి పోరాటాల ఫలితంగానే నేటి విద్యావ్యవస్థలో కొంత మార్పు సాధ్యమైందని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవన్‌కుమార్ అన్నారు. ఈ నెల 11 వరకు నిర్వహించే విద్యార్థి అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌక్‌లో పీడీఎస్‌యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే హక్కును విద్యార్థుల నుండి దూరం చేసే దిశగా పాలకులు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రస్తుత విద్య విధానం కార్పొరేట్ల చేతుల్లో వ్యాపార వస్తువుగా మారిందని.. పేదలకు అందనంత దూరంగా ఉండటం గమనించదగిన విషయమని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోవడం, స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్‌లు ఆపడం, కమిటీల పేరిట కాలయాపన చేయడం ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక ధోరణికి నిదర్శనమని తెలిపారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యకు మతం రంగు పులుముతూ, విదేశీ కార్పొరేట్ యూనివర్సిటీలకు అనుమతులిస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులపై విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. సంఘం నాయకులు స్వామి, అనిల్, అవినాష్, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
0000667174-000001-MBNR ADSALES SP
7.00x6.00
MBNR ADSALES SPOT PAYMENT ACCOUNT
విద్యావ్యవస్థలో మార్పు అమరుల త్యాగఫలమే..


