ఆత్మకూర్: మండలంలోని మూలమళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఇన్విటేషన్ కబడ్డీ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ పోరులో ఆంధ్రాకు చెందిన పల్నాడు, తెలంగాణకు చెందిన హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. విజేత జట్టుకు రూ.50 వేలు, రెండో బహుమతి రూ.40 వేలు, మూడో విజేతకు రూ.30 వేలు, నాలుగో బహుమతి రూ.20 వేలతో పాటు జ్ఞాపికలు అందించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ దేశాయి పద్మజారెడ్డి తెలిపారు. పోటీలను తిలకించేందుకు ఆయా రాష్ట్రాల క్రీడాకారులు తరలివచ్చారు.


