వనపర్తిటౌన్: క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదుగుతారని డీవైఎస్‌ఓ టి.సుధీర్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని క్రీడా మైదానంలో క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకుగాను జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోటీలు ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు క్రీడా పాఠశాల ఎంతో దోహదపడుతుందన్నారు. వనపర్తిని క్రీడాపర్తిగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. క్రీడల్లో సత్తా చాటడంతో ఉద్యోగాలు సాధించవచ్చని చెప్పారు. ఎంపికలకు వివిధ మండలాలకు చెందిన 60 మంది బాలురు పాల్గొన్నారని.. జిల్లాస్థాయిలో సత్తాచాటిన విద్యార్థులు ఏప్రిల్ 30, మే నెల 1న హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో రాష్ట్రస్థాయి ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇంటర్‌లో ప్రవేశాలు పెంచాలి : డీఐఈఓ
ఆత్మకూర్: రానున్న విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య కోరారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ కళాశాల్లో ప్రవేశాలు పొందేలా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ భాగ్యవర్ధన్‌రెడ్డి, అధ్యాపకులు టీజే విశ్వేశ్వర్, రాఘవేందర్‌రావు, లలితమ్మ, వీణ, చైతణ్యరాణి, స్వాతి, సునయన, విశ్వాస్, నారాయణ, దేవదాసు, సునీల్‌కుమార్, పావని, ఏకే కురుమూర్తి, రాఘవేంద్ర, రామన్‌గౌడ్ పాల్గొన్నారు.
హుండీ లెక్కింపు
అడ్డాకుల: కందూర్ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారి హుండీ లెక్కించారు. బ్రహోత్సవాలు, జాతరకు భక్తులు సమర్పించిన కానుకలు, నగదును లెక్కించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామస్తుల సమక్షంలో లెక్కింపు జరిగింది. రూ.5,17,591ల నగదు స్వామివారి హుండీ ద్వారా ఆలయానికి ఆదాయం సమకూరింది.


