
ఆటలతో ఆరోగ్యం పదిలం
వనపర్తిటౌన్: ఆటలతో ఆరోగ్యం పదిలమని.. నిత్య జీవితంలో క్రీడలు, వ్యాయామం భాగం కావాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో అండర్–14, 17 బాల బాలికలకు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, అథ్లెటిక్స్ క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని.. ఓటమి చెందిన విద్యార్థులు మరోమారు ప్రయత్నం చేసి విజయం సాధించేందుకు పట్టుదలతో ముందుకెళ్లాలని చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ప్రత్యేక దృష్టి సారిస్తే దేశ విదేశాల్లోనూ ప్రతిభ చాటి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డ్ ఛైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్‌చందర్ పాల్గొన్నారు.