
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు రెండ్రోజులుగా జిల్లాలోని 22ఏ(1) పరిధిలోని భూములు, ఆస్తుల వివరాలను సేకరించి నవీకరణ చేస్తున్నాం. లెక్క పూర్తిగా తేల్చిన తర్వాత జిల్లా వివరాలను సీసీఏల్‌ఏకు నివేదిస్తాం. ప్రభుత్వ భూములు, ఆస్తులు ఏవైనా పరాధీనంలో ఉంటే స్వాధీనం చేసుకునేందుకు ఈ వివరాలు ఉపయోగపడనున్నాయి. గతంలో రెండుసార్లు చేసినా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరోమారు పాత, కొత్త రికార్డులను పరిశీలించి కేటగిరీల వారీగా లెక్కతేలనుంది.
– సుబ్రమణ్యం, ఆర్డీఓ
●