
ఓట్ల చోరీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ
● ఏఐసీసీ పరిశీలకుడు, పుదుచ్చేరి
మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి
స్నాతకోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గురువారం ఉదయం 11 గంటలకు లైబ్రరీ ఆడిటోరియం వేదికగా జరిగే కార్యక్రమానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం వివిధ డిపార్ట్‌మెంట్ అధికారుల సహకారంతో ఏర్పాట్లు చేశాం. కార్యక్రమంలో ఎంఎస్‌ఎన్‌రెడ్డి గౌరవ డాక్టరేట్, 83 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 12 మందికి పీహెచ్‌డీ పట్టాలు అందుకోనున్నారు. – జీఎన్ శ్రీనివాస్, వీసీ పీయూ
●
ఆత్మకూర్/కొత్తకోట: అబద్దాలు, దొంగ ఓట్లతో కేంద్రంలో బేజేపీ అధికారంలోకి వచ్చిందని.. ఓట్ల చోరీ పాలన ఇక సాగదని ఏఐసీసీ పరిశీలకుడు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. బుధవారం కొత్తకోట, ఆత్మకూర్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బిహార్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రభుత్వం పెద్దఎత్తున కుట్రలు చేస్తోందని.. ఓట్ల చోరీకి పాల్పడేందుకు పూనుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం అభిప్రాయాలు సేకరించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నామని.. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి ఈ నెల 22న ఏఐసీసీకి నివేదిక అందిస్తామన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
పదేళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపాం..
రాష్ట్రంలో పదేళ్లలో జరగని అభివృద్ధిని 20 నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసి చూపామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆత్మకూర్‌లో జరిగిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ పాలనలో పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారని.. ఆ కలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని, ప్రతి కుటుంబానికి సన్నబియ్యంతో పాటు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.400 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తమవెంటే ఉన్నారని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ బలపర్చిన అభ్యర్థులే గెలవనున్నారని వెల్లడించారు.
పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక..
డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పారదర్శకంగా, అందరి అభిప్రాయం మేరకు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని జరుగుతోందని, తుది నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. కొత్తకోటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఓటు చోరీకి సంబంధించి ఆధారాలు బయటపెట్టినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుండా బీజేపీ కనుసన్నల్లో పని చేస్తోందన్నారు. అంతేగాకుండా బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయిలు బీఆర్‌ఎస్, బీజేపీలేనని ధ్వజమెత్తారు. కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఆత్మకూర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గీతకార్మిక సంఘం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, విండో అధ్యక్షుడు కృష్ణమూర్తి, నాయకులు అయ్యూబ్‌ఖాన్, గంగాధర్‌గౌడ్, పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల చోరీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ