
శంకర సముద్రానికి పెరిగిన వరద
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి శివారులో ఉన్న శంకరసముద్రం జలాశయానికి ఇటీవల కురుస్తున్న వర్షాలతో వరద చేరడంతో అధికారులు రెండు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. గురువారం జలాశయానికి ఎగువ నుంచి 100 క్యూసెక్కుల వరద రాగా.. 5 గేట్లలో రెండింటిని ఫీటు మేర పైకెత్తి 450 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఏఈ మనోజ్‌కుమార్ వివరించారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ఉన్నతాధికారుల ఆదేశానుసారం ముందస్తు చర్యలు చేపడతామని తెలిపారు.
రెండుగేట్లను ఎత్తిన అధికారులు