
గోపాల్‌పేటలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో..
గోపాల్‌పేట: మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో రెండురోజులుగా యూరియా లేదు. గురువారం సైతం రాదని తెలియడంతో రైతులు పీఏసీఎస్ ఎదుట ఉన్న బీటీ రోడ్డుపై ఆందోళన చేపట్టగా స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించి యూరియా తెప్పించాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పాండునాయక్ అక్కడకు చేరుకొని యూరియా శుక్రవారం వస్తుందని చెప్పినా రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు వినిపించుకోలేదు. స్థానిక అధికారులు జిల్లా అధికారులకు ఫోన్‌చేసి శుక్రవారం తప్పకుండా పంపిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఆందోళనతో రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.