
రైస్‌మిల్లును సందర్శించిన అధికారులు
వనపర్తి: పెద్దమందడి మండలం మదిగట్ల శివారులో నిర్మాణంలో ఉన్న రైస్‌మిల్లుకు గత యాసంగిలో వరి ధాన్యం కేటాయింపులు చేయడంతో ‘ఇదెక్కిడి చోద్యం’ శీర్షికన గురువారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఇందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించి గురువారం రైస్‌మిల్లును సందర్శించారు. ప్లాస్టిక్ నీటిట్యాంకులు తయారుచేసే పరిశ్రమలోనే రైస్‌మిల్లు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ధారించారు. అధికారులు వచ్చే వరకు ప్లాస్టిక్ నీటిట్యాంకుల తయారీ పరిశ్రమకు ఉన్న విద్యుత్ కనెక్షన్‌తోనే మిల్లు నడిపే ప్రయత్నం చేసినట్లు అవగతమవుతోంది. ఇప్పటి వరకు సీఎస్‌సీకి అప్పగించిన బియ్యం ఇక్కడే మర ఆడించినట్లు మిల్లరు చెప్పినా.. అక్కడ అందుకు సంబంఽధించిన పొట్టు, తవుడు కనిపించలేదు. సింగిల్‌ఫేస్ విద్యుత్ కనెక్షన్ కేవలం విద్యుద్ధీపాలకే వినియోగిస్తున్నట్లు మిల్లరు అధికారులకు వివరించారు. జిల్లా పరిశ్రమలశాఖ, పౌరసరఫరాల కార్పొరేషన్ డీఎం క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు చెప్పుకొచ్చారు. బాయిల్డ్ మిల్లు ఏర్పాటుకుగాను యంత్రాలు, ఇతర సామగ్రి బిగింపు పనులు కొనసాగుతున్నాయి. కొంతకాలంగా కనీస విద్యుత్ బిల్లు వస్తున్నట్లు తెలిసింది. మిల్లు నడుస్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే ధాన్యం కేటాయింపులు చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. మిల్లును సందర్శించిన వారిలో డీఎస్‌ఓ కాశీవిశ్వనాథం, డీపీఆర్వో సీతారాంనాయక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ పరమేష్ ఉన్నారు.
పాన్‌గల్‌లో భారీ వర్షం
పాన్‌గల్: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. పది రోజుల తర్వాత వర్షం కురవడంతో రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 61.03 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మండల కేంద్రంలోని పొల్కి చెరువు అలుగు పారింది.

రైస్‌మిల్లును సందర్శించిన అధికారులు