కొత్త పాట ఎందుకు నాయుడు.. | - | Sakshi
Sakshi News home page

కొత్త పాట ఎందుకు నాయుడు..

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

మనకు సకల సౌకర్యాలు సమకూరిపోతున్నపుడు ఎక్కడా తప్పులు కనిపించవు.. మనం అనుకున్నవన్నీ సాగిపోతుంటే లోపాలే కానరావు. కానీ ఇదయ్యా నీ తప్పు.. ఇదీ నీ పొరపాటు అంటే చాలు బురదపాము కూడా తాచులెక్క గయ్యిన లేస్తుంది. సాగినన్నాళ్లు తనకు తానొక మహా యోధుడిలా ఊహించుకోవడం.. చిన్న అడ్డంకి ఎదురవగానే ఆపసోపాలు పడుతూ.. ఎక్కడలేని శోకాలు తీస్తూ తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన వారినే ప్రశ్నించే స్థాయికి దిగజారిపోవడం పరిపాటి.

ఏటివోయ్‌ నాయుడు పెద్దపెద్ద మాటలు చెప్తున్నావ్‌.. నీ సత్తా ఎవరికి తెలియదు. 2019 ఎన్నికల ముందు వరకు నెల్లిమర్ల నియోజకవర్గ బాధ్యతలు చూసిన పెనుమత్స సాంబశివరాజు, ఆయన కొడుకు సురేష్‌ బాబులను కాదని ఎన్నికలకు కొద్ది కాలం ముందే నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కాదేటి చెప్మి. ఆనాడు వైఎస్‌ జగన్‌ ప్రభంజనంతో నెల్లిమర్ల ఎమ్మెల్యేగా గెలిచిన మాట నిజమే కదా. మీరన్నట్టు మీ చరిస్మాతోనే గెలిస్తే.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఘోరంగా ఎందుకు ఓడిపోయారో చెప్పరాదేటి. ఎక్కడో గ్రామ సర్పంచ్‌ స్థాయి నుంచి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, ఎమ్మెల్యే స్థాయి వరకు రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ లక్ష్మిలను మర్చిపోయింది నిజం కాదా ఏటి? అన్న చర్చ నెల్లిమర్లలో సాగుతోంది.

మీకు పదవులిచ్చి ఉన్నత స్థానంలో కూర్చోబెడితే పార్టీ బాగున్నట్లు.. నువ్వు ఓడిపోయి అధినేతపై ఇష్టానుసారం మాట్లాడొచ్చు.. అది నీకు వాక్‌ స్వాతంత్య్రం. ఈ పార్టీలో ఉంటూ వేరే పార్టీ వైపు చూడడం.. నీకు రాజకీయ స్వేచ్ఛ. కొంతమంచి కార్యకర్తలు.. నాయకులకు ఫోన్లు చేసి వేరేవైపు వెళ్లిపోదాం రెడీగా ఉండండి అంటూ సంకేతాలు ఇవ్వచ్చు.. అది కూడా మీకు తప్పుకాదు. కానీ పార్టీ క్రమశిక్షణ సంఘం సిఫారసు మేరకు నిన్ను సస్పెండ్‌ చేయడం పెద్ద తప్పు. పల్లకోవోయ్‌ నాయుడు.. నువ్వు చేస్తే ఘనకార్యం.. అదే పని పార్టీ చేస్తే తప్పా? ఇదెక్కడి రూలయ్యా నాయుడు. పవర్‌లో ఉన్నప్పుడు కనిపించని లోపాలు ఇప్పుడే వచ్చాయా? 2019లో వైఎస్సార్‌సీపీ టికెట్‌.. ఎమ్మెల్యే పదవి.. అధికార పార్టీ ప్రాధాన్యత.. జిల్లా స్థాయిలో రాజకీయ గౌరవం.. ఇలా పార్టీ అండతో రాజకీయంగా ఎదిగిన సమయంలో ఏ లోపం కనిపించలేదా..? ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో మాత్రం సిద్ధాంతాల నుంచి క్రమశిక్షణ వరకు అన్నీ ప్రశ్నించడం వెనుక అసలు రాజకీయ ఉద్దేశం ఏమిటోయ్‌ నాయుడు..!.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement