20 న ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలు | - | Sakshi
Sakshi News home page

20 న ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలు

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

● యూనియన్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ శివ ప్రసాద్‌

● యూనియన్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ శివ ప్రసాద్‌

విజయనగరం: ఏపీయూడబ్ల్యూజే 27వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఏపీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ పీఎస్‌ఎస్‌వీ. శివ ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు గురువారం ప్రెస్‌క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా 27వ మహాసభల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏపీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని చెప్పారు. జిల్లాస్థాయిలో రెండు విడతలుగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రడిటేటషన్ల మంజూరుకు కృషి చేసినట్లు చెప్పారు. ఫ్రీ లాన్స్‌ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ల మంజూరు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర మహాపాత్రో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం హక్కుల సాధన కోసం ఏపీడబ్ల్యుజే రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం సమన్వయంతో ముందుకెళ్తున్నాయని చెప్పారు. ఈనెల 20న జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగే 27వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అదే రోజు మధ్యాహ్నం యూనియన్‌ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ ఎలిశెట్టి సురేష్‌ కుమార్‌, విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ కమిటీ అధ్యక్షుడు లింగాల నరసింగరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎస్‌ఎన్‌ రాజు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు టి.రాధాకృష్ణ యూనియన్‌ నాయకులు కేజే శర్మ, పంచాది అప్పారావు, సముద్రాల నాగరాజు, వైఎస్‌ పంతులు, శెట్టి గోవిందరావు, బంకురు శంకరరావు, విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement