కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పడంతో పాటు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఇంతవరకూ ఏ హామీ నెరవేర్చలేదు. కూటమివి అన్నీ బూటకపు హామీలుగా మారాయి. నిరుద్యోగులు అంతా నిరాశతో ఉన్నారు. – ఖండాపు కోటేశ్వరరావు,
లక్ష్మీపురం, రాజాం మండలం
అన్నీ అబద్ధపు హామీలే
నిరుద్యోగులకు కూటమి ఎన్నో ఆశలు కల్పించింది. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీఇచ్చి అటకెక్కించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిపేసింది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం భర్తీచేయలేదు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సు వంటి ఉద్యోగాలు సైతం అటకెక్కాయి.
– కొర్ను చిన్నంనాయుడు,
నందబలగ, రాజాం మండలం


