● 304.77 గ్రాముల బంగారు
ఆభరణాలను స్వాధీనం చేసుకున్న
పోలీసులు
పూసపాటిరేగ: మండలంలోని చల్లవానితోట యాతపేట(కొండపాలెం)లో జరిగిన భారీ బంగారం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 304.77 గ్రాముల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ గురువారం తెలిపారు. కేసు వివరాలను వెల్లడించారు. పూసపాటిరేగ మండలం చల్లవానితోట యాతపేట(కొండపాలెం)కు చెందిన రీసు రాజు అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఈ నెల 17న శ్రీకాకుళం వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన మాతికమాని అప్పలనాయుడు అనే ఆటో డ్రైవర్ తనకున్న చెడు వ్యసనాలు, అప్పులు బాధల నుంచి విముక్తి పొందేందుకు స్నేహితుడైన పీత సాయిని కాపలా ఉంచి ఇంటిలో చొరబడ్డాడు. బీరువాలో ఉన్న సుమారు 11 రకాల బంగారు అభరణాలను దొంగిలించాడు. ఇద్దరు నిందితులు కలిసి వాటిని విక్రయించేందుకు ఈనెల 21న విజయనగరం వెళ్లేందుకు యాతపేట కూడలిలో వాహనం కోసం వేచి చూస్తుండగా, కచ్చితమైన సమాచారంతో అరెస్టుచేసినట్టు సీఐ తెలిపారు.


