గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019–24 మధ్య కాలంలో సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించింది. మరోవైపు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 15,400 మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించింది. వారికి నెలకు రూ.5వేలు చొప్పున గౌరవభృతి ఠంచన్‌గా అందించేది. ఉన్న ఊరిలో సేవలందిస్తూ ఉపాధి పొందేవారు. ఎన్నికల సమయంలో ఒక్కో వలంటీర్‌కు రూ.10 వేల నెలవారీ గౌరవ వేతనం ఇస్తామన్న చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక వలంటీర్ వ్యవస్థనే రద్దుచేశారు. నిరుద్యోగులకు ఉపాధిని దూరం చేశారు. మరోవైపు ఎండీయూ వ్యవస్తను రద్దుచేసి 250 మంది నిరుద్యోగులను రోడ్డున పడేశారు. ప్రభుత్వ వైన్ షాపుల్లో సూపర్‌వైజర్లుగా, సేల్స్‌మెన్‌లుగా, నైట్ వాచర్‌లుగా మరో 400 మంది పనిచేసేవారు. మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి.. సిండికేట్‌కు జైకొట్టి నిరుద్యోగులకు ఉపాధిని దూరం చేశారు.


