సమస్యలకు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు సత్వర పరిష్కారం

Mar 24 2026 6:48 AM | Updated on Mar 24 2026 6:48 AM

ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి

పార్వతీపురం రూరల్‌: ప్రజలు తెలియజేసిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవ్‌రెడ్డి బాధితుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్‌ మోసాలు, భూ వివాదాలు, ఆన్‌లైన్‌ వేధింపులు, ఇతర సమస్యలపై పది ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఎస్పీ ఫోన్‌లో మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్ట పరిధిలో తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పీజీఆర్‌ఎస్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మాధవ్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రానికి రాలేని వారు తమ పరిధిలోని సబ్‌ డివిజన్‌ కార్యాలయాలు లేదా పోలీస్‌ స్టేషన్లలోనూ ఫిర్యాదు చేసుకోవచ్చాన్నారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఎస్సై సురేష్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement