ముగిసిన రాష్ట్రస్థాయి టెన్నిస్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి టెన్నిస్‌ టోర్నమెంట్‌

Mar 24 2026 6:48 AM | Updated on Mar 24 2026 6:48 AM

విజయనగరం:

గర శివారులోని విజ్జీ స్టేడియంలో రెండు రోజలుగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సారథ్యంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న టెన్నిస్‌ టోర్నమెంట్‌ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 40 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. తుది పోరులో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి , జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ ట్రోఫీలు, మెడల్స్‌ అందజేశారు. విజయనగరంనకు చెందిన బి.మహేశ్వరరావు టెన్నిస్‌ సింగల్స్‌ విజేతగా నిలిచారు. అలాగే విజయనగరంనకు చెందిన టి.రామారావు, ఎ.సుదర్శనరాజు డబుల్స్‌ విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు.

విజేతలు వీరే..

టెన్నిస్‌ సింగల్స్‌ రన్నర్‌గా జి.ప్రభజనరెడ్డి (నంద్యాల), మూడవ ప్లేస్‌లో పి.రామకృష్ణారావు (కాకినాడ) నిలిచారు. అలాగే డబుల్స్‌ రన్నర్స్‌గా ఎంవీఎల్‌ఎన్‌ రాజు, కె.రమేష్‌ (విశాఖపట్నం), మూడో స్థానంలో ఎన్‌.రాము, ఆర్‌.రవికుమార్‌ (మన్యం పార్వతీపురం) నిలిచారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌.సత్తిబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌. వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement