విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ న్యాయ శాఖ సిబ్బంది సంఘం జిల్లా అధ్యక్షుడిగా తాడ్డి ప్రసాదరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. స్థానిక మదర్ థెరిసా క్లబ్ పార్క్ ఆవరణలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఏపీజీఆర్ రిౖటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రరావు, రాష్ట్ర న్యాయ శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి బొత్స రమేష్, ఎం.అచ్చిబాబు సమావేశానికి హాజరై అజెండాను ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా భగవాన్, కోశాధికారిగా కొల్లి పైడిరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీపాద కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా పిబి.కృష్ణంరాజు, వి.నారాయణమూర్తి, ఎన్.చంద్రశేఖర్, సహాయ కార్యదర్శులుగా డివిఎస్‌ఎన్.పట్నాయక్, టి.మన్మధరావు, చిన్నికృష్ణ ఎంపికయ్యారు. మూడేళ్ల పాటూ కార్యవర్గం కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ, డీఏ, పీఆర్‌సీ తదితర వాటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.


