● రోడ్డు వేశాం.. మాకేం స్తంబంధం.. | - | Sakshi
Sakshi News home page

● రోడ్డు వేశాం.. మాకేం స్తంబంధం..

Mar 21 2026 4:47 AM | Updated on Mar 21 2026 4:47 AM

ఈ చిత్రం చూశారా... ఇది నెల్లిమర్ల–రణస్థలం ప్రధాన రోడ్డు. ఇటీవల గొర్లిపేట, కొత్తపేట సమీపంలో తారురోడ్డు వేశారు. కనీసం విద్యుత్‌ స్తంభాలను పక్కకు జరపకుండా రోడ్డు వేయడంతో ఈ ప్రాంతీయులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నెల 27న రామతీర్థంలో రాములోరి కల్యాణోత్సవం జరగనుంది. వేలాది మంది భక్తులు ఈ రోడ్డు మీదుగానే ప్రయాణాలు సాగిస్తారు. విద్యుత్‌ స్తంభాలు రోడ్డుపైనే ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నారు. – నెల్లిమర్ల రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement