శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు పురస్కరించుకుని, విజయనగరంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. వేకువజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని, విశేష పూజలు చేశారు. ఈ కొత్త సంవత్సరమంతా సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. ఇదిలా ఉంటే చదురుగుడిలోని పైడితల్లి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేకాలంకరణలో దర్శనమిచ్చిన పైడితల్లికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త ఏడాది కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం


