ఆర్టీసీ కార్గో సేవల్లో చార్జీల చీటింగ్
విజయనగరం అర్బన్: విజయనగరం డిపో పరిధిలోని ఆర్టీసీ కార్గో సేవల్లో చార్జీల చీటింగ్ బయటపడింది. పట్టణానికి చెందిన ఒక వినయోగదారుడు ఈ నెల 18న విజయనగరం డిపో కార్గో సర్వీసులో 6 కిలోల బరువున్న పార్శిల్ విశాఖకు సాధారణ రవాణా కోసం బుక్ చేశారు. సంబంధిత బరువున్న వస్తువుకు రూ.68 మాత్రమే చెల్లించాలనే నిబంధన ఉంది. అయితే వినియోగదారుకు చెప్పకుండా అధిక చార్జీ రూ.101 ఉన్న డోర్ డెలివరీ రవాణ సేవ పేరున సంబంధిత సిబ్బంది బుక్ చేశారు. అధిక చార్జీ ఎందుకని అడిగినప్పటికీ సరైన సమాధానం చెప్పలేదని వినియోగదారుడు వాపోయాడు. పైగా ఉదయం 11 గంటకు విజయనగరం కార్గో సేవల కార్యాలయంలో బుక్‌చేసిన పార్శిల్ మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు విశాఖ పంపకుండా విజయనగరం కార్గో కార్యాలయంలోనే ఉందని వినియోగదారు తెలియజేశాడు. ఈ విషయంపై కార్గో కార్యాలయం మేనేజర్ దివ్య మాట్లాడుతూ వినియోదారుడు అడగకుండా డోర్ డెలివరీ రవాణా సేవల చార్జీ వేయడంపై సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్గోసేవలలో ఫాస్ట్ సర్వీసులు లేవని ఏ పట్టణానికై నా 24 గంటలలో అందజేసే నిర్దిష్ట నిబంధనలున్నాయని ఇవి విశాఖకు వెళ్లే పార్శిల్ సేవలకు వర్తిస్తాయన్నారు.
విశాఖ నుంచి విజయనగరానికి రూ.68 చార్జీ బిల్లు
విజయనగరం నుంచి విశాఖకు రూ.101 చార్జీ బిల్లు
ఆర్టీసీ కార్గో సేవల్లో చార్జీల చీటింగ్
ఆర్టీసీ కార్గో సేవల్లో చార్జీల చీటింగ్


