విజయనగరం విజేత
వీరవాసరం: కీర్తిశేషులు కొల్లా భాస్కరమ్మ, గుండా లక్ష్మీ రత్నావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరవాసరంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి. 25 జిల్లాల నుంచి వచ్చిన కబడ్డీ జట్లు అత్యద్భుత ప్రతిభ చూపగా విజయనగరం జిల్లా జట్టు మొదటి స్థానం సాధించి విజేతగా నిలిచింది. 2వ స్థానంలో ఎన్‌టీఆర్ జిల్లా, 3వ స్థానంలో కృష్ణా, అనంతపురం (కంబైన్డ్) జట్లు నిలిచాయి. విజేతలకు రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ ట్రోఫీలను అందజేశారు.
చెట్టు పైనుంచి పడి
గీతకార్మికుడి మృతి
డెంకాడ: మండలంలోని వెలంపేట గ్రామానికి చెందిన ఒనుము పాపయ్య(42) తాటిచెట్టు పైనుంచి పడిపోయి మరణించినట్లు ఎస్సై ఎ.సన్యాసినాయుడు మంగళశారం తెలిపారు. వెలంపేట గ్రామం శివారులో ఉన్న తాటిపెండిలో తాటిచెట్టు ఎక్కి పడిపోయిన పాపయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన పాపయ్యను చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తల్లి ఒనుము తౌడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


